ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌లో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో అధికారుల కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. యువ అధికారులు అవినీతికి ఆస్కారం లేని పనితీరును ప్రదర్శించాలని ఆయన సూచించారు.

vice-president-venkaiah-naidu-in-hyderabad-at-mcrhrdo-foundation-course-opening
vice-president-venkaiah-naidu-in-hyderabad-at-mcrhrdo-foundation-course-opening

By

Published : Feb 7, 2020, 8:52 PM IST

అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో శిక్షణ పొందే అధికారులకు ఫౌండేషన్‌ కోర్సును ప్రారంభించారు. అఖిల భారత సర్వీసులకు శిక్షణ పొందే 170 మంది అధికారులు వంద రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

శిక్షణ పొందే అభ్యర్థులు అవినీతికి ఆస్కారంలేని పనితీరును ప్రదర్శించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రాంతీయ సమస్యలు ఎదుర్కొనేలా సుపరిపాలన కోసం పాటుపడాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ.. సామాన్యుడి జీవన ప్రమాణాలు పెంచడమే ఉద్దేశంగా పనిచేయాలన్నారు.

ఇదీ చదవండిఃఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details