అలౌకిక ఆనందానికి, వ్యక్తిత్వ వికాసానికి కృష్ణుడు ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత ప్రబోధకుడిగా, రాజనీతిజ్ఞుడిగా కృష్ణుడి జీవితం స్ఫూర్తిదాయకమని.. మన సంస్కృతి, సంప్రదాయాలకు శ్రీకృష్ణతత్వం ప్రతీక అని వివరించారు. కృష్ణతత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలి: సీఎం జగన్
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి జగన్ శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రపంచానికి గీతను బోధించి ప్రేమతత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నట్టు ట్విటర్ ద్వారా సీఎం జగన్ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి షిమ్లాలో తన వివాహ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే ప్రజలకు శుభాకాంక్షలను తెలియచేశారు.
శ్రీకృష్ణుడి అవతారం ఆద్యంతం వ్యక్తిత్వ వికాస పాఠం వంటిది: చంద్రబాబు