'పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని ప్రజల పక్షాన నిలిచిన మహనీయుడు శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. నేడు దాశరథి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ వెంకయ్యనాయుడు నివాళులర్పించారు.
జాతీయోద్యమ రథసారధిగా భారత ప్రభుత్వ తామ్ర పత్రాన్ని అందుకున్న దాశరథి.. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం తపించారని ఉపరాష్ట్రపతి అన్నారు. 'నా పేరు ప్రజాకోటి - నా ఊరు ప్రజావాటి' అంటూ గర్వంగా ప్రకటించిన తెలుగు సాహితీ శిఖరమని కొనియాడారు. కావ్యకర్తగానే కాక కార్యకర్తగానూ ఉద్యమించిన దాశరథి.. క్షేత్రస్థాయి ప్రజల్లో స్వరాజ్యస్ఫూర్తిని రగిలించారని పేర్కొన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.