తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు సూచించారు. క్రీడల అభివృద్ధిలో ప్రైవేట్ రంగాన్నీ భాగస్వాములను చేయాలన్నారు. క్రీడారంగ అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతి అభినందించారు. దిల్లీలోని తన నివాసంలో కిరణ్ రిజిజు, అధికారులతో ఉపరాష్ట్రపతి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా మొగళ్లపాలెం ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, విజయనగరం విజ్జీ స్టేడియం, విశాఖలోని కొమ్మాది మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు, కాకినాడ క్రీడాప్రాధికార సంస్థ మైదానంలో ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ ఏర్పాటుపై వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఇండోర్ స్టేడియాలు, ఇతర ప్రాజెక్టులకు నిధులు విడుదల చేశామని ఉపరాష్ట్రపతికి కేంద్రమంత్రి వివరించారు. యూసీల రాకలో ఆలస్యం అవుతోందని చెప్పారు. యూసీలు వచ్చాక త్వరగా మిగతా పనులు పూర్తి చేయాలని కేంద్రమంత్రికి వెంకయ్య సూచించారు. సమావేశం మధ్యలో మంత్రి అవంతితోనూ ఉపరాష్ట్రపతి చర్చించారు.
కేంద్ర క్రీడా శాఖ మంత్రితో... ఉపరాష్ట్రపతి సమీక్ష - ఉప రాష్ట్రపతి తాజా న్యూస్
దిల్లీలోని తన నివాసంలో క్రీడాశాఖ మంత్రి, అధికారులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమీక్ష నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని మంత్రికి ఉపరాష్ట్రపతి సూచించారు.
కేంద్ర క్రీడా శాఖ మంత్రితో... ఉపరాష్ట్రపతి సమీక్ష
TAGGED:
ఉప రాష్ట్రపతి తాజా న్యూస్