ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ తరం యువతకు సబ్బం హరి ఆదర్శనీయం: ఉపరాష్ట్రపతి - Sabbam Hari passed away

మాజీ ఎంపీ సబ్బం హరి మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్బం హరి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ తరం యువతకు సబ్బం హరి ఆదర్శనీయమని పేర్కొన్నారు.

sabbam hari
demise of sabbam hari

By

Published : May 3, 2021, 8:40 PM IST

ఈ తరం యువతకు సబ్బం హరి ఆదర్శనీయం: ఉపరాష్ట్రపతి

సబ్బం హరి మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. మేయర్‌గా విశాఖ నగరాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని గుర్తు చేశారు. అనకాపల్లి ఎంపీగా సబ్బం హరి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సబ్బం హరి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

'మాజీ ఎంపీ, విశాఖపట్నం మాజీ మేయర్ సబ్బంహరి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. వారు వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రులు. నన్ను ఎంతగానో అభిమానించే వారు. క్రమశిక్షణ, రాజీలేని తత్వం, పనిలో సబ్బం హరి చూపించే చిత్తశుద్ధి ఈతరం యువతకు ఆదర్శనీయమైనవి. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' - వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details