మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. భాషా వైవిధ్యం నాగరికతకు గొప్ప పునాది అని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసే గొప్ప వారధన్న ఉపరాష్ట్రపతి.. జీవితానికి ఆత్మ అమ్మభాషేనని అన్నారు. మాతృభాషను మనం కాపాడుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రాథమిక విద్య నుంచి పరిపాలన వరకూ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సృజనాత్మకత, భావ వ్యక్తీకరణకు మాతృభాషను ప్రోత్సహించాలన్నారు.
భాషా వైవిధ్యం నాగరికతకు గొప్ప పునాది: ఉపరాష్ట్రపతి - మాతృభాషా దినోత్సవం న్యూస్
సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసే గొప్ప వారధి మాతృభాష అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషను మనం కాపాడుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రాథమిక విద్య నుంచి పరిపాలన వరకూ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
vice president taza