Venkaiah Naidu: రాష్ట్ర పునర్విభజన ప్రాజెక్టుల పరిస్థితిని తెలుసుకుంటూ ఆయా శాఖల మంత్రులకు ఉపరాష్ట్రపతి మార్గదర్శనం చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిపై ఆ శాఖల మంత్రి కిషన్‌రెడ్డితో ఉపరాష్ట్రపతి గత వారం సమీక్షించారు. అందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆ శాఖల అధికారులు ఉపరాష్ట్రపతికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సోమవారం తెలిపారు.
Venkaiah Naidu: 'విభజన హామీల అమలుపై దృష్టి పెట్టాలి'
Venkaiah Naidu: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించిన హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి సూచించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షిస్తేనే ప్రగతి పనులు వేగం పుంజుకుంటాయని తెలిపారు.
కాకినాడ సముద్ర ముఖద్వారంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నెల్లూరు-పులికాట్-ఉబ్బలమడుగు జలపాతం, నేలపట్టు-కొత్తకూడూరు-మైపాడు-రామతీర్థం-ఇస్కపల్లి ప్రాజెక్టు, కోస్టల్, బుద్ధిస్ట్ సర్క్యూట్లు, గుంటూరు, అమరావతి నగరాల్లో పర్యాటక అభివృద్ధి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం ఆలయాల అభివృద్ధి, నెల్లూరులోని వేదగిరి నరసింహస్వామి ఆలయం, అరకు-విశాఖ విస్టాడోమ్ (రైల్వే) ప్రాజెక్టు, తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి, పుట్టపర్తిలో సౌండ్ లైట్‌షో, ఉడాన్ పథకంలో విశాఖ-రాజమండ్రి, హైదరాబాద్-విద్యానగర్ (హంపి) మార్గాల పురోగతితోపాటు పలు పనుల పురోగతిని ఉపరాష్ట్రపతికి వివరించారు. ఈ ప్రాజెక్టుల విషయంలో తనకున్న సమాచారాన్ని, అనుభవాన్ని ఉపరాష్ట్రపతి అధికారులకు తెలిపారు.
ఇవీ చదవండి: