హైదరాబాద్లో మూడున్నర దశాబ్ధాల చరిత్ర ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్(Gaddi Annaram Fruit Market) ఇవాళ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. అక్టోబరు 1 నుంచి బాటసింగారం లాజిస్టిక్ పార్కులో క్రయ విక్రయాలు జరిపేలా చర్యలు చేపట్టింది. ఈ నెల 30లోగా గడ్డిఅన్నారం మార్కెట్(Gaddi Annaram Fruit Market) ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే..బాటసింగారం వెళ్లేందుకు కమీషన్ ఏజెంట్లు ఒప్పుకోవటం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో వర్తకులు, హమాలీల్లో ఆందోళన నెలకొంది.
"బాటసింగారం మార్కెట్ సక్రమంగా లేదు. కొహెడ మార్కెట్లో తాత్కాలిక ఏర్పాట్లు చేయండి. మార్కెట్ నిర్మాణం పూర్తయ్యాక కొహెడ నుంచి బాటసింగారానికి వెళ్తాం. అప్పటివరకు ఇక్కడే వ్యాపారం చేసుకుంటాం. మా గోడు వినకుండా.. మమ్మల్ని పట్టించుకోకుండా.. మా గురించి ఆలోచించకుండా వారికి వారే నిర్ణయాలు తీసుకున్నారు. మా గురించి ఆలోచన చేయలేదు. మేం ఎలా బతకాలి." - వర్తకులు