ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

10 నుంచి.. వేములవాడలో మహాశివరాత్రి జాతర - Vemulawada rajanna temple

మహాశివరాత్రికి తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబైంది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మహాశివరాత్రి జాతర జరుగనున్న నేపథ్యంలో.. ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో అలంకరించారు.

vemulawada Rajanna Temple
విద్యుద్దీపాల వెలుగులో వేములవాడ రాజన్న ఆలయం

By

Published : Mar 6, 2021, 6:44 AM IST

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో అలంకరించారు.

ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాలు.. దక్షిణ ద్వారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన విధులు విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details