ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేల్చేరుకు సమున్నత గౌరవం..సాహిత్య అకాడమీ ఆనరరీ ఫెలోగా ఎంపిక - Velcheru Narayana Rao latest news

ప్రాచీన తెలుగు సాహిత్య పరిరక్షణ ప్రాచుర్యం కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. పలు రచనలను ఆంగ్లంలోకి అనువదించి ప్రపంచదేశాలకు మన అమ్మ భాషలో మాధుర్యాన్ని రుచి చూపించారు. ప్రయోజనకరమైన వచన రచనల అవసరాన్ని చాటి చెప్పేందుకు విశేష కృషి చేస్తున్న వేల్చేరు నారాయణరావు... కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిక్‌కు ఎంపికయ్యారు.

Velcheru Narayana Rao
వేల్చేరుకు అత్యున్నత గౌరవ ఫెలోషిప్‌

By

Published : Feb 27, 2021, 4:41 AM IST

Updated : Feb 27, 2021, 6:10 AM IST

వేల్చేరుకు సమున్నత గౌరవం

శ్రీకాకుళంలో పుట్టి.. మేనమామ వద్ద విద్యాభ్యాసం చేసి... ఏలూరు కళాశాలలో అధ్యాపకునిగా సేవలందించిన వేల్చేరు నారాయణరావు... అంతర్జాతీయ పాఠకులకు తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసే బాధ్యతను తనకుతానే భుజాన వేసుకున్నారు. దాదాపు యాభై ఏళ్లకు పైగా తెలుగు సాహిత్య ప్రాచుర్యం కోసం పనిచేశారు. పలు ప్రాచీన తెలుగు రచనలను ఆంగ్లంలోకి అనువదించి ప్రపంచ దేశాలకు తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఆ అనువాద రచనలు అమెజాన్‌లో అందరికీ అందుబాటులో ఉన్నాయి.

పలు రచనలు ఆంగ్లంలోకి అనువాదం

ఏలూరులోని విద్యాభ్యాసం పూర్తి చేసిన నారాయణరావు... సీఆర్ రెడ్డి కళాశాలలో అధ్యాపకునిగా సేవలందించారు. మాతృభాష కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగా... అమెరికాకి వెళ్లి అక్కడ తెలుగు ఆచార్యునిగా సేవలందించారు. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా ప్రబంధాలు కావ్యాలు శతకాలు తదితర సాహిత్యాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరాన్ని విదేశీయులకు అర్థమయ్యేలా చెప్పేందుకు కృషి చేశారు.

అమెరికా నుంచి ఏడాది క్రితం వచ్చేసిన ఆయన... పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం కొప్పాకలో జీవిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపిక అవటంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు కవితలు పద్యాలు రాసే రచయితలు అనేక మంది ఉన్నారని... ఆలోచనలు రేకెత్తించేలా వచనం రాసేవారు రావాలని.. అప్పుడే తెలుగుభాషకు అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందని అభిప్రాయపడ్డారు.

వర్సిటీలు నుంచి సాహిత్యాభిమానులు దాకా..భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరముందని. దీంట్లో యువతరాన్ని భాగస్వామ్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

ఇదీ చదవండి:

ఉత్తమ వాలంటీర్లకు ఉగాది నుంచి సత్కారాలు..3 కేటగిరీలుగా అర్హుల ఎంపిక

Last Updated : Feb 27, 2021, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details