ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధాని కోసం భూములు తీసుకుని.. రోడ్డున పడేస్తారా..?' - అమరావతి రైతుల నిరసన

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు చేస్తోన్న ఆందోళనలు 70వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చిన తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని... వెలగపూడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

velagapoodi formers
'రాజధాని కోసం భూములు తీసుకుని..రోడ్డున పడేస్తారా?'

By

Published : Feb 25, 2020, 4:58 PM IST

రాజధాని ప్రాంతాల్లో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు

అమరావతికి మద్దతుగా రాజధాని గ్రామాల్లో 70వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, రైతు కూలీలు దీక్ష కొనసాగిస్తున్నారు. రాజధాని గ్రామమైన వెలగపూడిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు వీరి దీక్షలకు సంఘీభావం తెలిపారు. కొందరు రాజధాని రైతులకు మద్దతుగా వెలగపూడిలో 24 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నారు. 3 రాజధానుల నిర్ణయంతో అన్నదాతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజధాని కావాలని అడగకపోయినా గత ప్రభుత్వం రాజధాని కోసం భూములు తీసుకుందని... కలల రాజధాని కోసం భూములు ఇస్తే ఇప్పుడు వైకాపా ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

'రాజధాని రైతుల తరపున సుప్రీంకోర్టులో వాదిస్తాం'

ABOUT THE AUTHOR

...view details