ఓ సామాజిక వర్గం అధికారులను లక్ష్యంగా చేసుకొని జగన్ సర్కారు వేధింపులకు గురి చేస్తోందని తెదేపా ఆరోపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 50 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా నిలిపేయడమే ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. ఐటీ శాఖ అదనపు కమిషనర్‌గా జగతి పబ్లికేషన్స్‌లో అక్రమాలు వెలికితీసిన జాస్తి కృష్ణ కిషోర్‌పైనా సస్పెన్షన్, విచారణ పేరిట కక్ష సాధిస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితులపై పోలీసు అధికారులు, గెజిటెడ్ అధికారుల సంఘం స్పందించాలని కోరారు.
'ఓ సామాజిక వర్గం లక్ష్యంగా వైకాపా సర్కారు వేధిస్తోంది'
ఓ సామాజిక వర్గం అధికారులను లక్ష్యంగా చేసుకొని వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. 50 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా నిలిపేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
వైకాపా పై వర్ల రామయ్య