ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రస్ అల్​ ఖైమా లేఖపై సీఎం స్పందించాలి: వర్ల రామయ్య - తెదేపా నేత వర్ల రామయ్య వార్తలు ఇన్న ఈటీవీ భారత్

సీఎం జగన్‌ను అప్పగించాలని కేంద్రానికి రస్‌ అల్‌ ఖైమా లేఖ రాసిందని వర్ల రామయ్య వెల్లడించారు. ఈ విషయంపై తమకు సమాచారం ఉందన్నారు. లేఖ రాసిందా లేదా అన్నదానిపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.

varla ramayya press meet fr cm hjagan in vijayawada
రస్ అల్​ ఖైమా లేఖపై సీఎం స్పందించాలి: వర్ల రామయ్య

By

Published : Feb 19, 2020, 1:03 PM IST

రస్ అల్​ ఖైమా లేఖపై సీఎం స్పందించాలి: వర్ల రామయ్య

సీఎం జగన్‌ను తమకు అప్పగించాలని కోరుతూ.. కేంద్ర ప్రభుత్వానికి రస్‌ అల్‌ ఖైమా లేఖ రాసినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలుగుదేశం నేత వర్ల రామయ్య చెప్పారు. ఈ విషయంపై సీఎం జగన్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. తమ డబ్బును జగన్ నుంచి వసూలు చేయటంతోపాటు జగన్‌నూ అప్పగించాలన్నదే ఆ లేఖ సారాంశమని వర్ల తెలిపారు. 7 నెలల క్రితం సెర్బియా పోలీసులు.... నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేశారని గుర్తు చేశారు. రసల్‌ ఖైమా సంస్థ ఇచ్చిన సొమ్మును... జగన్‌కు సంబంధించిన వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లుగా నిమ్మగడ్డ ప్రసాద్‌ అక్కడి పోలీసులకు వెల్లడించారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details