ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలీసుల పని తీరు ప్రశ్నార్థకంగా మారింది' - latst news of tdp leader varla ramaya\

రాష్ట్రంలో పోలీసుల పని తీరు ప్రశ్నార్ధకంగా మారిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆక్షేపించారు. పోలీసులు వ్యవహార శైలిని న్యాయస్థానాలు తరచూ తప్పుబడుతున్నాయన్న ఆయన.. గత 9నెలల కాలంలో పోలీస్ వ్యవస్థపై డీజీపీ పున:సమీక్షించాలని హితవు పలికారు.

varla ramaya fired on state police behavior of famers
'పోలీసుల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది'

By

Published : Mar 4, 2020, 1:42 PM IST

ప్రతిపక్షాల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతోపాటు 144సెక్షన్ అమలు, గృహా నిర్బంధాలపై సమీక్ష జరపాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. డీజీపీ స్వయంగా హాజరుకావాలని న్యాయస్థానం అదేశిస్తుండటం పట్ల పున:సమీక్ష జరగాలన్న వర్ల రామయ్య...ఎస్సీ, ఎస్టీ కేసులు దుర్వినియోగంపైనా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. బాపట్ల ఎంపీ బయటకు వస్తే...రైతులపై ఇష్టానుసారంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. నందిగం సురేష్ ఎస్సీ ఎస్టీ కేసులు దుర్వినియోగం చేస్తున్నట్లు దేశంలో మరేవరూ చేయట్లేదని ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details