వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని 14 రోజులు క్వారంటైన్ లో ఉంచాలని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. ఏపీలో విజయసాయిరెడ్డి చాలా ప్రాంతాలు తిరుగుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన పుల్లెల గోపిచంద్‌ను హోమ్ క్వారంటైన్లో ఉంచారని గుర్తుచేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ వస్తునందున్న హోమ్ క్వారంటైన్లో ఉంచాలని తెలంగాణ డీజీపీని వర్ల రామయ్య కోరారు.
ఎంపీ విజయసాయి రెడ్డిని క్వారంటైన్ లో ఉంచండి: తెలంగాణ డీజీపీకి వర్ల లేఖ - విజయసాయి రెడ్డిపై వర్ల రామయ్య వ్యాఖ్య
హైదరాబాద్ వస్తున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని హోం క్వారంటైన్ లో ఉంచాలని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు.

తెలంగాణ డీజీపీకి వర్ల లేఖ
TAGGED:
తెలంగాణ డీజీపీకి వర్ల లేఖ