రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను సమీక్షించాలని కోరుతూ డీజీపీ గౌతం సవాంగ్‌కు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. దాడుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అందులో పేర్కొన్నారు.
ఎస్సీలనే లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే 1989 నాటి ఎస్సీ, ఎస్టీ పీవోఏ చట్టాన్ని సరైన విధంగా అమలుపర్చాలని కోరారు. అప్పుడే రాష్ట్ర ప్రజలకు, ఎస్సీలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందన్నారు.