'అప్పటినుంచి ఇప్పటిదాకా 160 సంఘటనలు జరిగాయి' - జగన్పై వర్ల రామయ్య కామెంట్స్
జగన్ సీఎం అయ్యాక హిందువుల మనోభావాలు దెబ్బతినే సంఘటనలు రాష్ట్రంలో 160 జరిగాయని.. తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ త్వరగా జరిగేలా... కేంద్ర హోంమంత్రికి జగన్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
!['అప్పటినుంచి ఇప్పటిదాకా 160 సంఘటనలు జరిగాయి' Varla Ramaiah fres on jagan over attacks on Hindu's opinions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8768636-836-8768636-1599846668110.jpg)
వర్ల రామయ్య
జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ హైందవుల మనోభావాలు దెబ్బతినే సంఘటనలు రాష్ట్రంలో 160 జరిగాయని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వీటిని ప్రభుత్వం ఆదిలోనే కట్టడి చేసి ఉంటే... అంతర్వేది ఘటన జరిగేది కాదని పేర్కొన్నారు. నాలుగు వారాల్లో సీబీఐ విచారణ పూర్తయ్యేలా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.