సీఎం జగన్‌పై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. చట్టం అమల్లో తన-పర భేదాలు తగవని హితవు పలికారు. అరాచకం కోసమే సీఎం అయినట్లు జగన్ శైలి ఉందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమై... చట్టాలు పాలనా వ్యవస్థ చేతిలోకి వెళ్లాయని ఆరోపించారు. చనిపోయినవారి కుటుంబాల పరామర్శకు వెళ్లకూడదనే చట్టం రాష్ట్రంలో ఉందా..? అని నిలదీశారు. గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు వీసా, పాస్‌పోర్టులు కావాలా అని ప్రశ్నించారు. తంబళ్లపల్లె దాడి మరో మాచర్ల ఘటన లాంటిదేనని దుయ్యబట్టారు.
'అరాచకం కోసమే సీఎం అయినట్లు జగన్ శైలి'
ముఖ్యమంత్రి అయ్యిందే అరాచకం కోసం అన్నట్లుగా సీఎం జగన్ శైలి ఉందని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. వైకాపా పాలనలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయిందని దుయ్యబట్టారు.
varla-ramaiah