అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రైతులు వెనక్కి తగ్గలేదని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశంసించారు. ఉద్యమకారుల్ని నిలువరించడానికి పోలీసులు గోళ్లతో రక్కినా, గిచ్చినా.. మొక్కవోని ధైర్యంతో నేటికీ ఆందోళనలు కొనసాగించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ వ్యవహారశైలిని పట్టించుకోకుండా ఆందోళనలు కొనసాగించాలని చెప్పడానికే.. తెదేపా అధినేత చంద్రబాబు, ఐకాస సభ్యులతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని స్పష్టం చేశారు. ఆందోళనలకు పరిష్కారం చూపకుండా కృత్రిమ ఆందోళనలు చేయించడం ద్వారా.. సీఎం ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వైకాపా కార్యకర్తలతో రోడ్లపై ఊరేగింపులు చేయించడం, శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నవారిపై కవ్వింపు చర్యలకు పాల్పడటం ఎంతవరకు సబబని నిలదీశారు.
'ఈ పనులతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?' - వైకాపా ప్రభుత్వంపై వర్ల రామయ్య విమర్శలు
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశాక.. రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఆందోళనలు 50వ రోజుకి చేరాయని.. తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ప్రజాఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నించిందని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న వారిపై కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టించినా.. రైతులు వెనక్కి తగ్గడం లేదన్నారు.
వర్ల రామయ్య