తెదేపా- భాజపాల విలీనమంటూ తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా పత్రికపై చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్ట్లకు ఫిర్యాదు చేశారు. అనుచిత రాతలను పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. వారు ప్రచురించిన కథనం జర్నలిస్టుల విలువలను దిగజార్చేలా ఉందన్నారు. ఇది ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 2016 కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధమన్నారు. కొంత మంది రాజకీయ నాయకులను మెప్పించేందుకే ఇలాంటి రాతలు రాశారని ఫిర్యాదులో తెలిపారు.
తప్పుడు కథనాల ప్రచురణపై పీసీఐకి ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య - tdp politbureau member varla ramaiah news
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్ట్ లకు ఫిర్యాదు చేశారు. తెదేపా- భాజపాల విలీనమంటూ తప్పుడు కథనాలు ప్రచురించిన ఓ వార్తా పత్రికపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య