ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారిపై చర్యలు తీసుకోండి.. గవర్నర్​కు వర్ల లేఖ - గవర్నర్​కు లేఖ రాసిన వర్ల రామయ్య

సీఐడీ అధికారి సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెదేపా నేత వర్ల రామయ్య.. గవర్నర్​కు లేఖ రాశారు. ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని వారు యువతను ప్రోత్సహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

varla letter governer biswabhushan harichandan
varla letter governer biswabhushan harichandan

By

Published : Jun 22, 2021, 9:46 AM IST

ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్సీ యువతని ప్రోత్సహిస్తున్న సీఐడీ అధికారి సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య గవర్నర్​ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. వారిద్దరిపై చర్య తీసుకోవాలని డీజీపీ సవాంగ్​కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని లేఖలో పేర్కొన్నారు. సునీల్‌ కుమార్‌ స్థాపించిన ఏఐఎం సంస్థ కార్యక్రమంలో భారతీయ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. సివిల్ కండక్ట్ రూల్స్​ను ఉల్లంఘించిన ఇద్దరు అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు. వీరిపై రాజద్రోహం నేరంపై కేసు పెట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details