విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. నవీ ముంబైలోని తళోజా జైలులో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్ల... జైలు సిబ్బంది వెంటనే జేజే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర అధికారులు హైదరాబాద్ పోలీసులకు తెలియజేశారు.
ఇప్పటికే తళోజా జైలులోని ఓ ఖైదీ కరోనాతో మృతి చెందినట్లు సమాచారం. భీమా కోరేగాం-ఎల్గార్ పరిషద్ కేసులో వరవరరావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. వరవరరావు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబీకులకు తెలిపినట్లు సీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. వారు ముంబై వెళ్లేందుకు సౌత్‌జోన్ డీసీపీ పాసులను జారీ చేసినట్లు సీపీ తెలిపారు.