ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

varla ramaiah: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది : వర్ల రామయ్య

దేశంలో మంచి పేరున్న ఏపీ పోలీసు వ్యవస్థ.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఔన్నత్యం కోల్పోయిందని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. సీఎం జగన్​, డీజీపీ గౌతం సవాంగ్​లు పోలీసు వ్యవస్థను మసకబారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందన్నారు.

varala ramiyya
varala ramiyya

By

Published : Aug 30, 2021, 8:52 PM IST

ముఖ్యమంత్రి జగన్​, డీజీపీ గౌతం సవాంగ్​లు పోలీసు వ్యవస్థను మసకబారుస్తున్నారని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందనటానికి చింతమనేని అక్రమ అరెస్టుతో పాటు అనేక కారణాలున్నాయన్నారు. డీజీపీ పలుమార్లు కోర్టు మెట్లెక్కడటమే ఇందుకు ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలికేందుకు, బదిలీలలకు భయపడి కొంతమంది పోలీసులు నిర్వర్తించే విధులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దేశంలో మంచి పేరున్న ఏపీ పోలీసు వ్యవస్థ.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఔన్నత్యం కోల్పోయిందన్నారు. సీఎం పరిధి దాటి వ్యవహరిస్తుంటే డీజీపీ సవాంగ్ అందుకు రెండడుగులు పరిధి దాటి అపకీర్తిని మూటగట్టుకున్నారని వర్ల రామయ్య విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details