పెదపరిమిలో రైతులు, మహిళలదీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం
రైతుల దీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం - amaravathi movement pi vangaveeti radha
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం తెలిపారు. ఒక పార్టీకో, వర్గానికో రైతులు భూములు ఇవ్వలేదని.. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చారని తెలిపారు. మంత్రులు రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను విన్నాను, నేను ఉన్నాను' అన్న జగన్మోహన్రెడ్డికి మహిళల బాధ వినిపించడం లేదా? అని మండిపడ్డారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, అమరావతి సాధించే వరకు అందరూ కలిసి పోరాటం సాగిద్దామని రాధాకృష్ణ అన్నారు.
![రైతుల దీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం vangaveeti radha supports amaravathi movement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6224003-628-6224003-1582804425415.jpg)
పెదపరిమిలో రైతులు, మహిళలదీక్షకు వంగవీటి రాధాకృష్ణ సంఘీభావం