ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తప్పులను కప్పిపుచ్చుకునేందుకే.. అమరావతిపై కుల ముద్ర' - అమరావతి ఉద్యమం తాజా వార్తలు

చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే వైకాపా ప్రభుత్వం రాజధానిపై కుల ప్రస్తావన తీసుకొస్తుందని తెదేపా నేత వంగవీటి రాధ మండిపడ్డారు. అమరావతి వల్ల ఒక కులం మాత్రమే బాగుపడుతోందనేది అవాస్తవమన్నారు.

'తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అమరావతిపై కుల ముద్ర'
'తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అమరావతిపై కుల ముద్ర'

By

Published : Dec 17, 2020, 3:05 PM IST

అమరావతి వల్ల ఒక కులం మాత్రమే బాగుపడుతోందని వైకాపా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని తెదేపా నేత వంగవీటి రాధ ఆరోపించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే రాజధానిపై కుల ప్రస్తావన తెస్తున్నారని మండిపడ్డారు. కుల, మతాలకు అతీతంగా అమరావతి కోసం ప్రజలంతా పోరాడుతున్నారని తెలిపారు. వైకాపాలో ఉన్నప్పుడు తనది ఏ కులమో... ఇప్పుడు అదే కులమనే విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. రాజధాని అమరావతి ఉద్యమం అందరి ఆశ, శ్వాసగా సాగుతోందని వంగవీటి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details