తుళ్లూరులో రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు తెదేపా నేత వంగవీటి రాధా. జగన్ మాట నెగ్గించుకోవడానికి ఎంత వరకైనా వెళ్తారని ఆయన మండిపడ్డారు. శాసనమండలి రద్దు అంశం అదే కోవకు చెందుతుందని అన్నారు. శాసనసభలో పొరపాట్లకు తావులేకుండా చూసేందుకే శాసనమండలిని ఏర్పాటు చేశారని చెప్పారు. రాజన్న రాజ్యమంటే ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టడమేనా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని సమస్య రాష్ట్ర ప్రజలందరిదని.. పార్టీలు, కుల, మతాలకు అతీతంగా ఉద్యమం సాగుతోందని అన్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేలా త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
రాజధాని సమస్య రాష్ట్ర ప్రజలందరిది: వంగవీటి - తుళ్లూరులో వంగవీటి రాధ పర్యటన వార్తలు
మాట నెగ్గించుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ ఎంతకైనా వెళ్తారని... శాసనమండలి రద్దు అదే కోవకు చెందుతుందని.. తెలుగుదేశం నేత వంగవీటి రాధా అన్నారు. తుళ్లూరులో రైతుల ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని సమస్య రాష్ట్ర ప్రజలందరిదని చెప్పారు.
vangaveeti