కేసుల భయంతో తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా తాకట్టు పెడుతున్నారో యువత, విద్యార్థులు గ్రహించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కోరారు. జగన్ దిల్లీ వెళ్లి అమిత్ షా, మోదీలను కేసుల మాఫీ కోసమే కలిశాడనే నిజం ఇప్పటికైనా యువత గుర్తించాలి. ప్రత్యేకహోదా తీసుకురావడం చేతకాకుంటే చంద్రబాబు రాజీనామా చేయాలంటూ గతంలో గగ్గోలు పెట్టిన వారంతా ఇప్పుడు జగన్ రాజీనామా చేయమని అడగగలరా అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని ఎలా తాకట్టు పెడుతున్నారో యువత గ్రహించాలి: అనిత - Anitha latest news
సీఎం జగన్ తన స్వార్థం కోసమే దిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాలను కలిశారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ నిజాన్ని ఇప్పటికైనా యువత గ్రహించాలని కోరారు.
వంగలపూడి అనిత
జగన్ వస్తే ప్రత్యేక హోదా వస్తుందని ఎన్నికల ముందు అన్న పెయిడ్ ఆర్టిస్టులు ఏమయ్యారని... వారందరికీ వాలంటీర్ ఉద్యోగాలు రావటంతో నోళ్లు తెరుచుకోవటం లేదా అని నిలదీశారు. అచ్చెన్నాయుడు నిమ్మాడలో ఉండగా అక్కడికి వెళ్లటం తనవల్ల కాదనే విజయసాయిరెడ్డి అక్రమ అరెస్టు చేయించారని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలను మానుకుని మరీ నిమ్మాడకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందని అనిత ప్రశ్నించారు.
ఇదీ చదవండి:'ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదు'