ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపే.. వాహనమిత్ర పథకం ప్రారంభం - vahanamitra in ap

ఏలూరులో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం శుక్రవారం ప్రారంభం కానుంది. పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆటోలు, కార్లు నడుపేవారికి ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం.. ఈ పథకం కింద అందనుంది.

vahanamitra-in-ap

By

Published : Oct 3, 2019, 2:54 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదగా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం.. శుక్రవారం లాంఛనంగా ప్రారంభంకానుంది. రేపు ఉదయం ఏలూరులో ప్రభుత్వ వైద్యకళాశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడిపేవారికి.. ఏడాదికి 10 వేల రూపాయల చొప్పున ఈ పథకం ద్వారా ఆర్థికసాయం అందించనున్నారు. లబ్దిదారులకు బ్యాంకులో జమ అయిన నగదుకు సంబంధించిన రసీదులను.. ముఖ్యమంత్రి అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని రేపు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలలో ప్రారంభిస్తారు.

ABOUT THE AUTHOR

...view details