ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవాగ్జిన్‌ డోసు ధర రూ.1,250.. కొవిషీల్డ్‌ రూ.850

హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లోని ఒక ఆసుపత్రి టీకాలిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవల వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఆసుపత్రులకు టీకాలు సరఫరా చేయగా.... ఇక నుంచి తయారీ కంపెనీల నుంచి ప్రైవేటు ఆసుపత్రులే నేరుగా కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పించారు.

 VACCINES SALES START IN PRIVATE HOSPITALS IN HYDERABAD
VACCINES SALES START IN PRIVATE HOSPITALS IN HYDERABAD

By

Published : May 7, 2021, 11:43 AM IST

హైదరాబాద్​లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకాల కార్యక్రమం మొదలైంది. టీకాల తయారీ కంపెనీల నుంచి ప్రైవేటు ఆస్పత్రులే నేరుగా కొనుగోలు చేసుకోనున్నారు. కొవాగ్జిన్‌ టీకా డోసును రూ.1,200, కొవిషీల్డ్‌ డోసును రూ.600 చొప్పున ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయిస్తామని సంబంధిత టీకా తయారీ సంస్థలు ప్రకటించాయి. జూబ్లీహిల్స్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రి కొవాగ్జిన్‌ డోసుకు రూ.1,250, కొవిషీల్డ్‌ డోసుకు రూ.850 వసూలు చేయాలని నిర్ణయించింది.

లక్డీకాపుల్‌లోని మరో ఆసుపత్రిలోనూ ఇవే ధరలకు టీకాలు వేస్తున్నారు. మిగిలిన ఆసుపత్రుల్లో కొద్దిరోజుల్లో ఈ కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్‌లో టీకాలు వేయించుకోవాలంటే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని వెళ్లాలి. 45 ఏళ్ల వయసు దాటినవారికి మాత్రమే టీకాలు ఇస్తామని ప్రైవేట్‌ ఆసుపత్రులవారు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details