ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం - Vaccination process is successful at 7 Dryrun centers

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కోసం చేపట్టిన డ్రైరన్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన 7 కేంద్రాల్లో రెండు గంటల పాటు డ్రైరన్ సాగింది. వివరాలను అధికారులు కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అధికారులు... పూర్తివివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.

Covid Vaccination process  at telengana
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్​ విజయవంతం

By

Published : Jan 2, 2021, 10:21 PM IST

దేశంలో కొన్నిరోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభంకానుండగా కేంద్రం మార్గదర్శకాల మేరకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు చేపట్టిన డ్రైరన్... మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తైంది. ప్రతి రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల డ్రైరన్ చేపట్టాలన్న కేంద్రం సూచన మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీఎచ్​సీ, గాంధీ ఆస్పత్రి సహా ప్రైవేటు ఆస్పత్రుల విభాగంలో సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లోని జీజీహెచ్, జానంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నేహా షైన్ ఆస్పత్రుల్లో ప్రక్రియను నిర్వహించారు.

నాలుగు దశలు...

టీకావేయడం మినహా నాలుగుదశల్లో జరిగే ప్రక్రియను ఇందులో పరిశీలించారు. తొలుత వెయిటింగ్,. రెండోదశలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, మూడోదశలో వ్యాక్సినేషన్, నాలుగోదశలో పర్యవేక్షణను పరిశీలించారు. ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చినవారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీసిన అధికారులు... దీర్ఘకాలిక వ్యాధులు సహా ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా అనే వివరాలు సేకరించారు. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో టీకా ఇచ్చిన తర్వాత... తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా పరిశీలించారు.

గవర్నర్​ పరిశీలన...

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డ్రైరన్ ప్రక్రియను గవర్నర్ తమిళిసైసౌందర రాజన్ పరిశీలించారు. తిలక్ నగర్ యూపీహెచ్​సీకి వెళ్లిన గవర్నర్... అక్కడి ఏర్పాట్లు, డ్రైరన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్, ఇమ్యునైజేషన్ జేడీ సుధీర, హైదరాబాద్ డీఎంహెచ్ఓ... తిలక్‌నగర్ యూపీహెచ్​సీలో ప్రక్రియను పరిశీలించారు.

కేంద్రానికి...

గాంధీ ఆస్పత్రిలో జరిగిన ట్రయల్‌ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో అధికారులు పొందుపరిచారు. పూర్తి వివరాలను మరోమారు కేంద్రానికి పంపనున్నట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు.

మహబూబ్​నగర్ జిల్లాలో...

మహబూబ్‌నగర్ జిల్లాలోని జనరల్ ఆసుపత్రితో పాటు నేహా షైన్‌ ఆస్పత్రి, జానంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్రైరన్ చేపట్టారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు డ్రైరన్ పనితీరును పరిశీలించగా... మూడు కేంద్రాల్లో ముగ్గురు ఇంఛార్జిలు పక్రియను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ ఎలా జరగనుందనేది ఈ ప్రక్రియ ద్వారా పరిశీలించిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నారు.

ఇదీ చూడండి:కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి

ABOUT THE AUTHOR

...view details