తొలి విడత వాక్సినేషన్‌లో భాగంగా గత వారం రోజులుగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం... నేటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వాక్సినేషన్ ప్రారంభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల ప్రైవేట్ ఆస్పత్రులుండగా వీటిలో సుమారు లక్షా 55 వేల మంది సిబ్బంది వ్యాక్సిన్ కోసం కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్నారు. వారందరికీ నేటి నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్కారు యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల్లో... సుమారు లక్షా పది వేల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొందరు మాత్రమే అతి స్వల్పంగా రియాక్షన్ బారిన పడ్డారు. ఆశించిన దానికన్నా వ్యాక్సిన్ రియాక్షన్ చాలా తక్కువగా ఉందని సర్కారు ప్రకటించింది.
నేటి నుంచి టీకా...
ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. 50 మందికన్నా అధికంగా వ్యాక్సిన్ తీసుకునే వారు ఉన్న ఆస్పత్రుల్లో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇక అంతకన్నా తక్కువ మంది ఉన్న దవాఖానాల సిబ్బందికి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా ఇవ్వనున్నారు.
నోడల్ అధికారి...