ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి కోసం.. 15 రోజులుగా అమెరికాలో ప్రవాసాంధ్రుడి దీక్ష

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ప్రవాసాంధ్రుడు, వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌బాబు చేపట్టిన నిరాహార దీక్ష శనివారం పదిహేనో రోజుకి చేరింది. ఆరోగ్యం కొద్దిగా క్షీణించినా.. రాజధాని కోసం దీక్షను విరమించదలుచుకోలేదని తేల్చి చెప్పారు.

uyyuru lokesh
అమెరికాలో ప్రవాసాంధ్రుడి దీక్ష

By

Published : Feb 28, 2021, 8:15 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్‌తో అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ప్రవాసాంధ్రుడు, వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌బాబు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష.. శనివారం పదిహేనో రోజుకి చేరింది. అమెరికాలో ఉదరకోశ వ్యాధుల నిపుణుడిగా పనిచేస్తున్న ఆయన ఈ నెల 13న నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రస్తుతం చాలా నీరసంగా, నిస్సత్తువగా ఉన్నా.. తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమరణ నిరాహార దీక్షను విరమించదలుచుకోలేదని తెలిపారు.

"పోలవరం ప్రాజెక్టు నాశనానికి ప్రధాని మోదీ, సీఎం జగన్‌రెడ్డి తెర తీశారు. అమరావతి రైతులు.. పోలవరం నిర్వాసితులు, రాయలసీమ, ఆంధ్ర ప్రాంత రైతులు, విశాఖ ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తున్న వారితో కలసి ఉద్యమించాలి. ఆంధ్రప్రదేశ్‌ని వల్లకాడు చేస్తున్న వారిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించండి" అని ఓ ప్రకటనలో లోకేశ్ బాబు కోరారు. తెలుగు ప్రజలకు అండగా ఉండాలన్న లక్ష్యంతోనే దీక్ష ప్రారంభించానని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమ పంథా మారాలని కోరుకుంటున్న సగటు ప్రవాస భారతీయుడినని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details