ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతుంటే కేసీఆర్​ పట్టించుకోవడం లేదు: ఉత్తమ్​ - quit india

కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్​ పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ విమర్శించారు. కరోనా కట్టడి విషయంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 78వ క్విట్​ ఇండియా ఉద్యమ దినోత్సవ సందర్భంగా ఉత్తమ్​ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

utham kumar reddy
utham kumar reddy

By

Published : Aug 9, 2020, 3:07 PM IST

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో క్విట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ కీలకమైనదని, ఈ ఉద్యమమే స్వతంత్ర పోరాటానికి తీవ్ర స్థాయిలో బీజం వేసిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ తెలిపారు. 78వ క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. క్విట్‌ ఇండియా స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతుంటే కేసీఆర్​ పట్టించుకోవడం లేదు: ఉత్తమ్​

కేంద్ర ప్రభుత్వం 5వ తేదీన ఉన్నత స్థాయి కమిటీ మీటింగ్ పెడితే కేసీఆర్ కేబినెట్ సమావేశం ఉందని... కమిటీ మీటింగ్ వాయిదా వేయడం అన్యాయమని అన్నారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details