ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తాం: మంత్రులు - Karumuri Nageswara rao took charge as minister

New Ministers took charge: రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఉషాశ్రీ చరణ్, ఆదిమూలపు సురేశ్,కారుమూరి నాగేశ్వరరావులు నేటి నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తమ తమ కార్యాలయాల్లోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి తమకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు.

Ministers take charge
Ministers take charge

By

Published : Apr 14, 2022, 2:22 PM IST

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఉషాశ్రీ చరణ్, ఆదిమూలపు సురేశ్,కారుమూరి నాగేశ్వరరావు..

Ushasri Charan took charge as minister : రాజకీయంగా, ఆర్ధికంగా ఎదిగితేనే మహిళలు నిజమైన సాధికారత సాధించినట్లని....స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ అన్నారు. సచివాలయంలో మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు.

Karumuri Nageswara rao took charge as minister : పౌరసరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు... బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన కార్యాలయంలోకి కారుమూరి నాగేశ్వరరావు ప్రవేశించారు. తనను నమ్మి సీఎం జగన్‌ ఇచ్చిన ఈ కొత్త బాధ్యతలను వమ్ముచేయనని అన్నారు. వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించి 56 మంది అడ్వొకేట్​లకు నూతనచట్టం ప్రకారం వేతనం చెల్లించే ఫైల్​పై తొలి సంతకం చేశారు.

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఉషాశ్రీ చరణ్, ఆదిమూలపు సురేశ్,కారుమూరి నాగేశ్వరరావు..

Adimulapu Suresh took charge as minister: పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేశ్‌బాబు సచివాలయంలో తన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తనకిచ్చిన ఈ కొత్త శాఖను సైతం విజయవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు వారి అనుచరులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి :15న ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణం.. పాల్గొననున్న సీఎం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details