ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో యూఎస్​ ఎడ్యుకేషన్​ సెంటర్​: అమెరికా కాన్సులేట్ - open doors report on american studies

గత పదేళ్లలో అమెరికాలో చదువుకునేందుకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయిందని హైదరాబాద్​లోని అమెరికా కాన్సులేట్ తెలిపింది. దేశంలో వై-యాక్సిస్ ఆధ్వర్యంలో నడిచే రెండో ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్​ను హైదరాబాద్​లో వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

usa-education-center-in-hyderabad-said-us-consulate
usa-education-center-in-hyderabad-said-us-consulate

By

Published : Nov 19, 2020, 6:08 PM IST

దేశంలో వై-యాక్సిస్ ఆధ్వర్యంలో నడిచే రెండో ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్​ను హైదరాబాద్​లో వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు అమెరికా కాన్సులేట్ ప్రకటించింది. ఈ కేంద్రంలో నిపుణులు ఉంటారని.. వారు అమెరికాలో విద్య గురించి కచ్చితమైన, తాజా సమాచారం ఇస్తారని కాన్సూల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ వెల్లడించారు.

మరోవైపు నవంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్​లో అమెరికాలో ఉన్నత విద్యపై అవగాహన కల్పించనున్నట్లు హైదరాబాద్​లోని అమెరికా కాన్సులేట్ తెలిపింది. ఓపెన్ డోర్స్ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019-20లో 2 లక్షల మంది అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారని పేర్కొంది. అక్కడ చదువుకునే వారిలో 20 శాతం మంది భారతీయులేనని.. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నట్లు కాన్సులేట్ వెల్లడించింది. గత పది సంవత్సరాల్లో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయిందని తెలిపింది.

దేశంలో వీసా ప్రాసెసింగ్ విషయంలో హైదరాబాద్​లోని అమెరికా కాన్సులేట్ మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు ఉచిత అడ్వైజరీ సర్వీసులను అందిస్తున్నట్లు కాన్సూల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్ చర్చ!

ABOUT THE AUTHOR

...view details