ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

50 వేల బస్తాల యూరియా వర్షార్పణం.. - urea bags soaked in rain in rfcl

Urea damage in Ramagundam : తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో మంగళవారం సుమారు 50 వేల యూరియా బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఎరువును సంచుల్లో నింపేందుకు ఎత్తుగా నిర్మించిన షెడ్డు రేకులు గాలివానకు లేచిపోవడంతో అందులో ఉన్న సంచులు తడిసిపోయాయి. బ్యాగులను తరలించే కన్వేయర్‌ బెల్టుపైనే వర్షం పడటంతో సుమారు 3 గంటల పాటు లోడింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.

50 వేల బస్తాల యూరియా వర్షార్పణం..
50 వేల బస్తాల యూరియా వర్షార్పణం..

By

Published : Jul 13, 2022, 9:38 AM IST

Urea damage in Ramagundam : ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో మంగళవారం ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 50 వేల యూరియా బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఎరువును సంచుల్లో నింపేందుకు ఎత్తుగా నిర్మించిన షెడ్డు రేకులు గాలివానకు లేచిపోవడంతో అందులో ఉన్న సంచులు తడిసిపోయాయి. బ్యాగులను తరలించే కన్వేయర్‌ బెల్టుపైనే వర్షం పడటంతో సుమారు 3 గంటల పాటు లోడింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. మరోవైపు నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే షెడ్డు రేకులు ఎగిరిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఆర్​ఎఫ్​సీఎల్​ 'కిసాన్' బ్రాండ్ పేరుతో దేశంలో ఎరువులను సరఫరా చేస్తోంది. దేశంలో ఏటా 12.7 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఉత్పత్తి అవుతాయని అంచనా వేయగా.. అందులో 6 లక్షల మెట్రిక్‌ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నారు. 2015లో రూ.6,120 కోట్లతో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి.. ఇటీవల ఉత్పత్తిని ప్రారంభించింది. వర్షాల కారణంగా పైకప్పు కూలిపోవడంతో పాటు 50,000 యూరియా బస్తాలకు నష్టం వాటిల్లగా.. ఆర్ఎఫ్‌సీఎల్‌ పనుల నాణ్యతలో ఉన్న డొల్లతనం బయటపడినట్లయింది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details