Civils notification: సివిల్ సర్వీసెస్-2022 నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య పెరిగింది. మొత్తం 861 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. 2020లో 796, 2021లో 712 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2019లో మాత్రం 896 ఖాళీలను భర్తీ చేశారు. 2021 ప్రకటనకు సంబంధించి ఇటీవలే ప్రధాన పరీక్షలు ముగిశాయి.
Civils notification: సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల - ap latest news
Civils notification: దేశంలోనే అత్యున్నత సర్వీసులకు నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష-2022కు సంబంధించిన తేదీలను యూపీఎస్సీ వెల్లడించింది. దరఖాస్తుకు ఈనెల 22 వరకు గడువు ఉన్నట్లు తెలిపింది.
Civils notification
జూన్ 5న ప్రాథమిక పరీక్ష:సివిల్స్-2022 ప్రాథమిక పరీక్ష జూన్ 5న జరగనుంది.
దరఖాస్తు గడువు:ఫిబ్రవరి 22