రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం ప్రకటించింది.
WEATHER : వచ్చే మూడు రోజులు ఆ ప్రాంతాల్లో వర్షాలు... - andhrapradhesh weather
వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో వాతావరణం