ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Train Services: 19 నుంచి అన్​ రిజర్వ్​డ్​ సర్వీసులు: ద.మ.రైల్వే - south central railway latest news

దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఈ నెల 19 నుంచి అన్​ రిజర్వ్​డ్​ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో సమానంగా ఈ రైళ్లు నడపబడతాయని తెలిపింది.

Unreserved Services starts from 19th of this month
19 నుంచి అన్​ రిజర్వ్​డ్​ సర్వీసులు: ద.మ.రైల్వే

By

Published : Jul 17, 2021, 9:02 PM IST

దక్షిణ మధ్య రైల్వే దశల వారీగా రైలు సర్వీసులను పునరుద్ధరిస్తోంది. అందులో భాగంగా స్థానిక ప్రయాణికులకు ఉపయోగపడేలా ఈ నెల 19 నుంచి అన్​ రిజర్వ్​డ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో సమానంగా నడపబడతాయని రైల్వే శాఖ తెలిపింది. వీటితో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించింది.

దక్షిణ మధ్య రైల్వే గత సంవత్సరం ముఖ్యమైన మార్గాల్లో పట్టాల పటిష్ఠత కోసం అనేక పనులను చేపట్టింది. ఫలితంగా రైళ్ల వేగం పెరిగి ప్రయాణ సమయం తగ్గడం వల్ల ఈ రైళ్లు అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసులుగా నడపడానికి వీలు కలిగిందని రైల్వేశాఖ పేర్కొంది. ఈ నెల 19 నుంచి 82 రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 82 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నడపడం వల్ల ప్రయాణికులందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని వెల్లడించింది.

ప్రయాణికులు టికెట్లను వివిధ మార్గాల్లో కొనుగోలు చేయవచ్చని రైల్వేశాఖ తెలిపింది. స్టేషన్లలోని బుకింగ్‌ కౌంటర్లతో పాటు యూటీఎస్‌ యాప్‌(ఆన్‌లైన్‌), ఏటీవీఎమ్‌ (ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్​), సీవోటీవీఎమ్‌లు (కాయిన్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్స్​) మొదలగు వాటిల్లో టికెట్లు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

నిబంధనలు పాటించాలి..

మరోవైపు కరోనా నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్​ గజానన్​ మాల్యా పేర్కొన్నారు. ప్రయాణికులు సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ప్రయాణ సమయం మొత్తంలో మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వైరస్​ వ్యాప్తికి ప్రయాణికులు కారకులు కావొద్దని విజ్ఞప్తి చేశారు.

గతంలోనే అందుబాటులోకి వచ్చిన ఎంఎంటీఎస్​ సేవలు

రాష్ట్రంలో కొవిడ్​ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో గత నెలలోనే ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయ. గతేడాది మార్చి 23న నిలిచిన ఎంఎంటీఎస్‌ సేవలు.. దాదాపు 15 నెలల తర్వాత అందుబాటులోకి వచ్చాయి.

2003 ఆగస్టులో ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లు గతేడాది మార్చి 23 వరకు నిరంతరాయంగా సేవలందించాయి. అలాంటిది కరోనా దెబ్బకు 15 నెలలుగా షెడ్డుకే పరిమితం కాగా.. కొవిడ్​ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో గత నెలలో సేవలను పునరుద్ధరించారు.

2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లు..

ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర 2003 నుంచి నిరంతరం సేవలందిస్తున్నాయి. 15 కిలో మీటర్ల సికింద్రాబాద్-ఫలక్​నుమా సెక్షన్ ఫిబ్రవరి 2014లో ప్రారంభమైంది. జంట నగరాల్లో మొత్తం 26 స్టేషన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రారంభంలో 48 సర్వీసులు, 6 కోచ్‌లు 13 వేల మంది ప్రయాణికులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్.. ప్రస్తుతం 121 సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇదీ చూడండి:

భారత్​కు యుద్ధ హెలికాప్టర్లు అప్పగించిన అమెరికా

ABOUT THE AUTHOR

...view details