ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరించింది ప్రభుత్వం. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు తెరవకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తగిన జాగ్రత్తలతో యోగా ట్రైనింగ్ సెంటర్లు, జిమ్ లకు ఇవాళ్టి నుంచి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాలు కూడా భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
అన్ లాక్ 3.0.. మార్గదర్శకాలు అమలు చేస్తూ.. ఉత్తర్వులు - ఏపీలో అన్లాక్ 3.0 న్యూస్
కేంద్ర హోం శాఖ జారీ చేసిన అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
unlock orders notification in andhrapradesh