Kavach system Trial run by Ashwini Vaishnav: తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటలో ఏర్పాటు చేసిన 'కవచ్' వ్యవస్థ పనితీరు కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా అత్యంత సమీపానికి వచ్చి ఆగిపోతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రయల్ రన్‌లో ఆయన పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ పరిజ్ఞానంతో ఈ టెక్నాలజీని కనుగొన్నారు. నవాబ్‌పేట మండలం చిట్టిగిద్ద, గొల్లగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎదురెదురుగా రైళ్లు వచ్చిన సమయంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేసిన లోకో మోటివ్ ఇంటర్ లాకింగ్ సిస్టంను ఆయన పరిశీలించారు.
ఆటోమేటిక్‌గా బ్రేకులు..
ఈ కవచ్ వ్యవస్థతో రైళ్లకు ఆటోమేటిక్‌గా బ్రేకులు పడతాయని కేంద్రమంత్రి వివరించారు. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా వచ్చినప్పుడు గుర్తించి ఇది ఆపుతుందని చెప్పారు. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలు నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుందని కేంద్రమంత్రి వెల్లడించారు. ట్రయల్ రన్ అనంతరం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మేధ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.
స్పందిస్తుంది