jal shakti meet with ap tg cs : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై చర్చించనుంది. ఈ మేరకు శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ దృశ్యమాధ్యమం ద్వారా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, ఏపీ సీఎస్ సమీర్ శర్మతో సమావేశం అవుతారు. రెండు బోర్డులకు నిర్వహణ కోసం ఒక్కో రాష్ట్రం నుంచి 200 కోట్ల చొప్పున సీడ్ మనీ ఇవ్వడం, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, సమాచారం ఇచ్చి బోర్డులకు స్వాధీనం చేసే అంశాలపై చర్చిస్తారు.
jal shakti meet with ap, tg cs : తెలుగు రాష్ట్రాల సీఎస్లతో కేంద్రం కీలక సమావేశం - ఏపీ తెలంగాణ సీఎస్లతో కేంద్రజలశక్తి మీటింగ్
jal shakti meet with ap tg cs: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. నోటిఫికేషన్ అమలు విషయంలో అసంతృప్తిగా ఉన్న కేంద్ర జలశక్తి శాఖ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించనుంది.
Jalashakthi Meeting
jal shakti meet on krmb grmb gazette issue : అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవడం, ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు విషయమై భేటీలో చర్చిస్తారు. నోటిఫికేషన్ల అమలు దిశగా ఉన్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల నుంచి అందాల్సిన సహకారం తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.
ఇదీ చూడండి:వంగవీటి రాధాకు 2 ప్లస్ 2 గన్‌మెన్లతో భద్రత.. సీఎం జగన్ ఆదేశం