Nirmala Sitharaman: అనంతపురం జిల్లా పాలసముద్రంలో న్యాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్) నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజ చేశారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ పాలసముద్రంలో 500 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్లతో ఈ అకాడమీ నిర్మించనున్నారు. దక్షిణ భారత్‌లో రెండో అతిపెద్ద శిక్షణ కేంద్రం ఇదే కానుండడం విశేషం. ఐఆర్‌ఎస్‌లకు (ఇండియన రెవెన్యూ సర్వీసెస్) ప్రొబెషనరీలో భాగంగా ఇక్కడ శిక్షణ ఇస్తారు.
పరోక్ష పన్నుల అంశంపై అభ్యర్థుల సామర్థ్యాన్ని పెంచేలా.. పాలసముద్రంలో ఐఆర్‌ఎస్‌లకు శిక్షణ ఇస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి గౌరవం దక్కేలా న్యాసిన్ మంజూరు చేశామన్నారు. సకల సౌకర్యాలతో న్యాసిన్ పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. 2023 సెప్టెంబర్ నుంచి ఐఆర్‌ఎస్ బ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మలాసీతారామన్ వెల్లడించారు.
ఇదీ చదవండి:అనంతపురంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన