ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ తెలిపారు. ఏపీకి ఇప్పటివరకు 20 లక్షల 28 వేల 899 ఇళ్లు మంజూరు చేయగా.. కేవలం 3 లక్షల 60 వేల 325 మాత్రమే పూర్తయ్యాయని.. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2015-16 నుంచి 2018-19 వరకు రాష్ట్రానికి మంజూరు చేసిన 12 లక్షల 32 వేల 237 ఇళ్లలో.. రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల 22 వేల 716 ఇళ్లను రద్దు చేసిందని వెల్లడించారు. ఉన్న ఇళ్లను వదలడానికి ప్రజలు ఇష్టపడకపోవడం, బహుళ అంతస్తులపై విముఖత వంటి కారణాలను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు.
'75 శాతం పూర్తయితేనే కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తాం' - ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణాలపై మాట్లాడిన హర్‌దీప్‌సింగ్ పూరీ
ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ అన్నారు. ఏపీకి మంజూరు చేసిన వాటిలో కేవలం 40 శాతం ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయని తెలిపారు. అందులో 44 శాతం మాత్రమే పూరైనట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
'75 శాతం పూర్తయితేనే కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తాం'
ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల 9 వేల 521 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మంజూరైన ఇళ్లలో 75 శాతం పూర్తయితేనే కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఏపీకి మంజూరు చేసిన వాటిలో కేవలం 40 శాతం ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమవ్వగా.. అందులో 44 శాతం మాత్రమే పూరైనట్లు వెల్లడించారు.