ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amith Sha: తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారు: అమిత్ షా - తెలంగాణ విమోచన దినోత్సవ సభ

తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. నిర్మల్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో షా పాల్గొన్నారు. భాజపా తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని అమిత్​ షా స్పష్టం చేశారు.

Amith Sha
తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారు -అమిత్ షా

By

Published : Sep 17, 2021, 7:57 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా

ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవమని.. మన నినాదాలు మరఠ్వాడా వరకు వినిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. తెలంగాణలోని నిర్మల్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఆ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన శుభాకాంక్షలు తెలిపారు. పటేల్‌ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ రాష్ట్ర విమోచనం సాధ్యమైందని చెప్పారు. ఇవాళ విశ్వకర్మ జయంతి కూడా అని తెలిపారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్న అమిత్​ షా... మజ్లిస్‌కు భాజపా భయపడదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టవా? అంటూ నిలదీశారు.

"అందరికి హైదరాబాద్​ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. నిజాం రాజ్యంలో ఉన్న తెలంగాణ, బీదర్​, మరఠ్వాడ సర్దార్​ వల్లాభాయి పటేల్​ పరాక్రమంతో స్వేచ్ఛ పొందింది. 13 నెలల తర్వాత హైదరాబాద్​ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్రం లభించింది. ఈరోజు మన ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం. "

-అమిత్​ షా, కేంద్రహోంమంత్రి

ఇదీ చదవండి:Prashanth Kishore : ఈసారి పీకే పాచికలు పారుతాయా?

ABOUT THE AUTHOR

...view details