ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవితంలో ఒక్కసారైనా సమతామూర్తిని దర్శించుకోవాలి: అమిత్‌ షా - ముచ్చింతల్​లో అమిత్ షా

Amit shah Muchintal Visit : రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమతా సూత్రం బోధించారన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా... జీవితంలో ఒక్కసారైనా సమతామూర్తిని దర్శించుకోవాలని అభిప్రాయపడ్డారు. శంకరాచార్యులు కూడా సనాతన ధర్మాన్ని కాపాడారని గుర్తు చేశారు. కులం, మతం, జాతి బేధం లేకుండా సమతామూర్తిని దర్శించుకోవాలని సూచించారు. ముచ్చింతల్ శ్రీరామనగరంలోని దివ్య దేశాలను ఆయన దర్శించుకున్నారు.

Amit shah Muchintal Visit
Amit shah Muchintal Visit

By

Published : Feb 8, 2022, 10:07 PM IST

Amit shah Muchintal Visit : దేశంలో ప్రసిద్ధ క్షేత్రంగా సమతా కేంద్రం ఖ్యాతి గడిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కులం, మతం, జాతి బేధం లేకుండా జీవితంలో ఒక్కసారైనా సమతామూర్తిని దర్శించుకోవాలని కోరారు. తెలంగాణలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలోని దివ్య దేశాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల విశిష్టతను సెల్ఫ్ గైడ్ టూల్ ద్వారా తెలుసుకున్నారు. సమతా మూర్తి కేంద్రం విశేషాలను అమిత్ షాకు చినజీయర్ స్వామి వివరించారు.

ముచ్చింతల్​లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

హిందూత్వం జీవనది లాంటిది: అమిత్ షా

హిందూత్వం జీవనది లాంటిందని కేంద్రంమంత్రి అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రవాహం ఆగదని పేర్కొన్నారు. రామానుజాచార్యులు 120 ఏళ్లు జీవించారన్న అమిత్ షా... మనిషి 60 ఏళ్లు జీవిస్తే సంపూర్ణంగా భావించే రోజుల్లో 120 ఏళ్లు జీవించారని గుర్తు చేశారు. వేదాల్లో చెప్పినట్లే రామానుజచార్యులు జీవించి చూపారని అన్నారు. వెయ్యేళ్ల క్రితమే జాతి, భాషా బేధాలను రూపుమాపేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.

కులం, మతం, జాతి బేధం లేకుండా సమతామూర్తిని దర్శించుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా సమతామూర్తిని దర్శించుకోవాలి. రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమతా సూత్రం బోధించారు. శంకరాచార్యులు కూడా సనాతన ధర్మాన్ని కాపాడారు. దేశంలో ప్రసిద్ధ క్షేత్రంగా సమతాకేంద్రం ఖ్యాతి గడిస్తుంది. హిందుత్వం జీవనది లాంటింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రవాహం ఆగదు. 2003లోనే చినజీయర్‌ స్వామితో పరిచయం ఏర్పడింది. గుజరాత్‌ భూకంప బాధితులకు చినజీయర్‌ స్వామి సాయం చేశారు. చినజీయర్‌ స్వామి ఓ గ్రామాన్ని పునర్నిర్మించారు. చినజీయర్‌ స్వామి చిన్న వాళ్లనైనా ఎంతో గౌరవిస్తారు. చినజీయర్ స్వామి మర్యాద చూస్తే మనసు ఉప్పొంగింది.

-అమిత్ షా, కేంద్రహోం మంత్రి

హైదరాబాద్ గర్వించేలా సమతామూర్తి ఏర్పాటు చేసినట్లు తెలిపిన చినజీయర్‌ స్వామి.. మోదీ, అమిత్ షా ద్వయం ధర్మపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. చినజీయర్ స్వామి మర్యాద చూస్తే మనసు ఉప్పొంగిందన్న అమిత్‌ షా.. చిన్న వాళ్లనైనా ఎంతో గౌరవిస్తారని తెలిపారు.

హైదరాబాద్ గర్వించేలా సమతామూర్తి ఏర్పాటు చేశాం. 1035 కుండలాలతో మహాయజ్ఞం కొనసాగుతోంది. ఇవాళ, రేపు ధర్మాచార్య సదస్సు నిర్వహిస్తాం. ప్రధాని, అమిత్ షా ద్వయం ధర్మపాలన చేస్తున్నారు.

చినజీయర్‌ స్వామి , సమతామూర్తి కేంద్రం వ్యవస్థాపకులు

వైభవోపేతంగా ఉత్సవాలు

శ్రీరామనగరంలోని 108 దివ్యక్షేత్రాలు సందర్శించిన అనంతరం.. యాగశాల పూజల్లో కేంద్రమంత్రి పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు అమిత్‌షా తిరుగుపయనం కానున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షాకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికారు. మరోవైపు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో ఏడో రోజు పెద్ద సంఖ్యలో పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యులు రాకతో సందడిగా మారింది. రథ సప్తమిని పురస్కరించుకొని యాగశాలలో శ్రీనారసింహ ఇష్టి హోమం నిర్వహిస్తున్నారు. ప్రవచన మండపంలో ప్రత్యేకంగా ధర్మాచార్య సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 450 మంది స్వామిజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యులు హాజరయ్యారు.

ఈనెల 13న రానున్న రాష్ట్రపతి

statue of equality : ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. రామానుజాచార్యులు ముందు తరాలకు ప్రేరణగా నిలిచారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శ్రీరామనగరంలో 108 దివ్య దేశ మందిరాల ఏర్పాటు అద్భుతమన్న ప్రధాని.. దేశమంతా తిరిగి ఆలయాలు చూసిన అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రమైన ముచ్చింతల్​ను సందర్శించడానికి ఈనెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రానున్నారు. ముగింపు వేడుకల సందర్భంగా ఈ దివ్యక్షేత్రాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా రానున్నారు. త్వరలోనే ఆయన శ్రీరామనగరంలో పర్యటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్​రాజన్, సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చింతల్​ను సందర్శించారు. సోమవారం నిర్వహించిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Statue Of Equality: కళ్లు చెదిరే నిర్మాణ చాతుర్యం.. కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details