KEY MEETING ON BIFURCATION : కేంద్ర హోంశాఖ ఈ నెల 27వ తేదీన నిర్వహించ తలపెట్టిన విభజన సమస్యల పరిష్కార చర్చల ఎజెండాలో ‘నూతన రాజధాని నగర’ నిర్మాణ అంశాన్ని ప్రతిపాదించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం 11 గంటలకు నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో జరిగే ఈ చర్చల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు పంపింది. వాటిని ద్వైపాక్షిక, ఇతర అంశాలుగా విభజించింది. ద్వైపాక్షిక అంశాల్లో ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న సమస్యలకు స్థానం కల్పించింది. ఇతర అంశాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సమస్యలను జోడించింది. ఇందులోనే నూతన రాజధాని నగర సృష్టికి కేంద్ర ప్రభుత్వ మద్దతు, కొత్త రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ నిర్మాణం అంశాలను చేర్చింది. ఇందులో స్పష్టంగా ‘న్యూకేపిటల్ సిటీ’ అని పేర్కొన్నారు తప్పితే ‘న్యూ కేపిటల్ సిటీస్’ అని చెప్పలేదు.
* విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న దుగరాజపట్నం పోర్టు, బయ్యారం స్టీల్ ప్లాంటు, కడప స్టీల్ ప్లాంటు, గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, కొత్త రైల్వేజోన్ ఏర్పాటు, విశాఖపట్నం, విజయవాడలలో మెట్రో రైలు నిర్మాణం వంటి అంశాలేవీ ఎజెండాలో కనిపించలేదు.2 రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్తు బకాయిల అంశాన్నీ చేర్చలేదు.
ద్వైపాక్షిక అంశాలు
1 షెడ్యూల్ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన.
2 షెడ్యూల్ 10లో ఉన్న రాష్ట్ర స్థాయి సంస్థల విభజన.
3 విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనని సంస్థల పంపిణీ.
4 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) విభజన.
5 సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ విభజన.