పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు సమర్పించిందని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రభుత్వం సమర్పించిన బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదని కేంద్రం పేర్కొంది. మరో రూ.479 కోట్లకు బిల్లులు అందలేదని తెలిపిన కేంద్ర ప్రభుత్వం... 2014 నుంచి రూ.8,614 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేశామని వెల్లడించింది. రూ.12,506 కోట్ల పనులు చేశామని ఏపీ తెలిపిందన్న కేంద్రం... 2014 ఏప్రిల్ నుంచి 2020 జులై వరకు ఈ పనులు చేసినట్లు ఏపీ తెలిపిందని వివరించింది.
పోలవరం బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదు: కేంద్రం - Union Government comments on Polavaram
పోలవరం ప్రాజెక్టు గురించి ప్రభుత్వం సమర్పించిన బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదని కేంద్రం పేర్కొంది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రాజెక్టు ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు సమర్పించిందని కేంద్రం స్పష్టం చేసింది.
2020 సెప్టెంబర్ 12 నాటికి పోలవరం 71.46 శాతం పూర్తయిందని ఏపీ తెలిపిందని కేంద్రం పేర్కొంది. పోలవరానికి రూ.15 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం లేఖ రాశారన్న కేంద్రం... 2020 ఆగస్టు 25న సీఎం జగన్ లేఖ రాసినట్లు కేంద్రమంత్రి రతన్‌లాల్ కటారియా వెల్లడించారని తెలిపింది. పనుల పురగోతి, బిల్లుల తనిఖీ, పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సు మేరకే నిధుల విడుదల ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండీ... 'పాలకులు మారినప్పుడల్లా... సంప్రదాయాలు మారవు'