పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు, అవినీతి జరుగుతున్నట్లు పెంటపాటి పుల్లారావు రాసిన లేఖను ప్రధాన మంత్రి కార్యాలయం జల్‌శక్తి మంత్రిత్వశాఖకు పంపి వివరణ కోరింది. దీనితో ఆ శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ అనూప్ కుమార్ శ్రీవాస్తవ ఈనెల 5న ప్రధానమంత్రి కార్యాలయ డైరెక్టర్ రాజేంద్రకుమార్‌కు వివరాలు పంపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నవంబరు 13న లేఖలో రాసిన అంశాలను ఆయన వివరించారు. ‘
‘సంబంధిత అధీకృత సంస్థల ఆమోదం తీసుకున్న తర్వాతే అన్ని నిర్ణయాలూ జరిగాయి. పనుల్లో కానీ, ఎం బుక్కు నమోదులో కానీ తేడాలున్నాయేమోనని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పరిశీలిస్తోంది. ఒకసారి అది నివేదిక సమర్పిస్తే నిబంధనలు, విజిలెన్స్‌కోడ్‌కు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అని ఏపీ ప్రభుత్వం తమకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.