రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో పర్యావరణ ప్రభావ మదింపు కమిటీ (ఈఏసీ) సిఫార్సుల ఆధారంగానే పర్యావరణ అనుమతులపై తమ శాఖ నిర్ణయం ఉంటుందని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జల వివాదాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాయడంపై ప్రశ్నించగా ఆయన స్పందించారు. తెలంగాణలోని ఆమ్రాబాద్ మండలం మాచారంలో పోడు భూముల సాగు విషయంలో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య వివాదం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఘటనలో ఓ అధికారిపై గిరిజన మహిళ పెట్రోలు పోసి, తనపై పోసుకోవడం విచారకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అటవీ హక్కుల చట్టాన్ని సమర్థంగా అమలు చేస్తామని తెలిపారు.
నేడు ఈఏసీ భేటీ...